In Association with Amazon.in

Monday, December 11, 2017

www.appharmacist.blogspot.in
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసిస్టుల సమాఖ్య, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మరియు జిల్లాల స్థాయిలో కార్యనిర్వాహక వర్గం నియామకం కొరకు ప్రకటన జారీ చేయడం జరిగింది.
అర్హత: నాయకత్వ లక్షనాలు కలిగి, ఫార్మసీ కోర్సు చదివిన నిరుద్యోగులు, ఎదైనా ఫార్మసీ రంగం లో (Retail/ Hospital/ Industry/ Academic/ Clinical/ etc) కొలువు చేస్తున్నవారు, ఫార్మసీ కోర్సు చదువుతున్న విద్యార్థులు సైతం ధరకాస్తు చేయవచ్చును.
ఎంపికైన వారు స్వచ్చందంగా ఫార్మసిస్టుల మరియు ఫార్మసీ వృత్తి రంగాల సంక్షేమం కొరకు పనిచేయవలసి వుంటుంది (ఒక ఫార్మసిస్టుగా ఇది మన భాద్యత కూడా). ఎంపికచేయబడిన ఆయా ప్రాంత ఫార్మసిస్టులకు నాయకత్వం వహించవలసి వుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసిస్టుల సమాఖ్య తరపున నియమించిన ఆ ప్రాతానికి, సంబందించిన ఫార్మసిస్టుల ఫోరానికి అధ్యక్షత వహిస్తూ, కార్యచరణ మరియు కార్యనిర్వహణ భాద్యతలు చేపట్టాలి.
నియమించిన ఆయా ప్రాతంలో, సంబందించిన ఫార్మసిస్టుల ఫోరంకు చెందిన సభ్యులను సమీకరించి వారికి నాయకత్వం వహించాలి. అవసరమైతే సమావేశపరచాలి.
మహిళా ఫార్మసిస్టులకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యవర్గం కలదు.
కార్యనిర్వాహక సభ్యులు సమాఖ్య యొక్క కార్యములను అమలు పరుచుటకు కొన్ని బాద్యతలతో పాటూ, కొన్ని అధికారాలను ఇవ్వడం జరుగుతుంది. కార్యనిర్వాహక సభ్యులు, సాధారణ సభ్యులను సమన్వయపరుస్తూ సమాఖ్య యొక్క లక్ష్య సాధన కు స్వచ్చందంగా పనిచేస్తారు. ఆ లక్ష్యాలను సులభంగా సాధించుటకు సాధారణ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులకు సహకరిస్తారు.
కార్యనిర్వాహక సభ్యులకు ఒక అధికారిక సీలు, లెటర్ ప్యాడ్ ఫార్మాట్ ను అందచేయడం జరుగుతుంది. కార్యనిర్వహక సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల సమాఖ్య తరపున తమ పరిది లోకి వచ్చే స్థానికతను బట్టి ఎవరితోనైనా అధికారిక సంభాషణలకు జరుపుటకు ఉపయోగించే అధికారం కల్పించబడుతుంది.
తమ తమ రోజూ వారి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ఒక రోజులో లేదా వారంలో కొంత సమయాన్ని వెచ్చించి ఫార్మసీ వృత్తి యొక్క సంక్షేమం కోసం పాటుబడితే – ఫార్మసీ వృత్తి రాష్ట్రం లో పరిణవిల్లుతుంది.

5 comments:

  1. I'm from SRIKAKULAM...sir how can I apply this. Is there any welfare association situated in srikakulam. Please notify me sir..mail id jayarampaila60@gmail.com

    ReplyDelete